ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర
on Jan 9, 2026

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.
అక్క, చెల్లి, అమ్మ లేకుండా..ఇక బంగారమ్స్ నేను నేను మస్త్ ఉన్నా...అసలే చాలా బిజీ లైఫ్ లో, చాలా అచీవ్ చేయాలి, మీమ్ పేజెస్ హ్యాండిల్ చేయడం కాకుండా..అప్సెట్ అవలేదు దేనికీ అవను కూడా. నా వెనక మాట్లాడుకునే జోకర్స్ కంటే నేను ముందే ఉన్నాను. నా మీద కంటెంట్ చేసుకునేవాళ్ళందరికీ మంచి జీవితం ఉండాలని కోరుకుంటున్నా" అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఫైనల్ గా #saavandiఅని కూడా పెట్టింది. నైనిక ఒరిస్సా పిల్ల. హైదరాబాద్ వచ్చి సెటిల్ ఐన ఫామిలీ. నైనికాకు డాన్స్ అంటే పిచ్చితో డాన్సర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి దూసుకెళ్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



